రామ్ చరణ్ కొత్త చిత్రం ఓపినింగ్ మే 31 న
ఈ చిత్రానికి 'టాప్ లేచిపోద్ది' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా నిర్మాత బండ్ల గణేష్ ..పిల్మ్ ఛాంబర్ లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయటంతో ఈ సినిమాకు సంభందించిన టైటిల్ అని చెప్పుకుంటున్నారు. అయితే కాదు వేరే హీరో కోసం అని మరో ప్రక్క వినపడుతోంది. టైటిల్ ఏదనేది ఓపినింగ్ రోజున తెలిసే అవకాసం ఉంది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.
మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ....రామ్ చరణ్‌ను ఆయన గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. రామ్ చరణ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications












