రామ్ చరణ్-కొరటాల శివ మూవీ ముహూర్తం ఫిక్స్
హైదరాబాద్ : ఇటీవల హీరో ప్రభాస్ తో 'మిర్చి' సినిమాను తీసి మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కొరటాల శివ, నెక్ట్స్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లో అగ్రనిర్మాతగా రాణిస్తున్న బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం మే 2వ వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. మరో వారం లో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ....రామ్ చరణ్‌ను ఆయన గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. రామ్ చరణ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications












