మెగా అనౌన్స్‌మెంట్: రామ్ చరణ్-కొరటాల మూవీ డీటేల్స్
రామ్ చరణ్-కొరటాల కాంబినేషన్లో సినిమా ఫైనల్ అయింది. ఈ చిత్రాన్ని స్వయంగా రామ్ చరణ్ తన సొంతబేనర్లో నిర్మించబోతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కొంబినేషన్లో తొలిసారి ఓ సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని రామ్ చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ అఫీషియల్‌గా ప్రకటించింది.
ఈ చిత్రాన్ని స్వయంగా రామ్ చరణే నిర్మించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో ప్రొడక్షన్ నెం.3 గా రామ్ చరణ్-కొరటాల శివ మూవీ రాబోతోందని ప్రొడక్షన్ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.

Recommended Video

ఈ సినిమా నిర్మాణంలో నిరంజన్ రెడ్డి కూడా భాగం కాబోతున్నారు. ఇతకు ముందు ఆయన మాట్నీ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో క్షణం, ఘాజీ లాంటి చిత్రాలను తెరకెక్కించారు. ఇపుడు కొణిదెల ప్రొడక్షన్స్‌తో కలిసి రామ్ చరణ్- కొరటాల మూవీ తెరకెక్కిస్తున్నారు. 2018 వేసవిలో ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది.
కొణిదెల ప్రొడక్షన్లో తొలి సినిమాగా తన తండ్రి చిరంజీవితో 'ఖైదీ నెం 150' నిర్మించిన రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ బేనర్లో ప్రొడక్షన్ నెం.2 కూడా చిరంజీవితోనే చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.


Click it and Unblock the Notifications











