»   » అది నిజంకాదు: రామ్ చరణ్ సినిమాపై కృష్ణ వంశీ

అది నిజంకాదు: రామ్ చరణ్ సినిమాపై కృష్ణ వంశీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో...బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ చిత్రం ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 6 నండి ప్రారంభం కానుంది. అయితే ఈచిత్రానికి 'గోవిందుడు అందరి వాడేలే' అనే టైటిల్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. మా చిత్రానికి టైటిల్ ఖరారు కాలేదని దర్శకుడు కృష్ణ వంశీ అంటున్నాడు.

కృష్ణ వంశీ మాట్లాడుతూ...'రామ్ చరణ్ హీరోగా పరమేశ్వ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మాత బండ్ల గణేష్ అత్యంత భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 6 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. మా చిత్రానికి సంబంధించి రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. కానీ మేము ఇంకా ఏ టైటిల్ ఖరారు చేయలేదు. ఏదైనా ఉంటే పాత్రికేయుల సమక్షంలో తెలిజయజేస్తాం. ఎలాంటి గాసిప్స్ ఊహించుకోవద్దు' అని తెలిపారు.

తొలుత ఈ చిత్రాన్ని రామ్ చరణ్-వెంకటేష్‌లతో మల్టీ స్టారర్ మూవీగా ప్లాన్ చేసారు. కానీ తర్వాత వెంకటేష్ సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే సినిమాలో తన పాత్రకు అంతగా ప్రాధాన్యత లేక పోవడం, రామ్ చరణ్‌కే కథలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం, బల్క్ డేట్స్ కావాల్సి రావటంతో వెంకటేష్ తప్పుకోవటానికి కారణాలు గా చెప్తున్నారు. వెంకటేష్ స్థానంలో శ్రీకాంత్‌ను తీసుకున్నారు. ఈచిత్రంలో చరణ్ బాబాయ్ పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నాడు.

ఈ చిత్రానికి టాలీవుడ్లో ఫాంలో ఉన్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్‌ను ఎంపిక చేసాడు. ఇంతకు ముందు తమన్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. కృష్ణ వంశీ సినిమాల స్టైల్లో తెరకెక్కే ఈచిత్రానికి భారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా రిచ్ లుక్‌తో అదరిపోయే ఫ్యామిలీ సబ్జెక్టుతో ప్లాన్ చేస్తున్నారు.

English summary
Mega power star Ram Charan’s next film with director Krishna Vamsi. The title has not finalized. Its shooting is expected to begin from Feb 6th. Kajal Aggarwal is the heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu