రామ్ చరణ్, కృష్ణ వంశీ మూవీ ప్రారంభం(ఫోటోలు)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో, పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో, శివబాబు బండ్ల సమర్పణలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం నిరాడంబరంగా ఫిలింనగర్ దైవ సన్నిదానంలో పూజా కార్యక్రమాలతో ఈ రోజు జరిగింది.
రామ్ చరణ్ దేవుడి పటాలపై చిత్రీకరించి సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, సత్యరంగయ్య ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసారు. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేసారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ..క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ చిత్రమిది. చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్, తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా దర్శకుడు కృష్ణ వంశీ అద్భుతమైన కథను రెడీ చేసారు అన్నారు.
రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటి వరకు ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించలేదు. రామ్ చరణ్, కాజల్ కాంబినేసన్లో వచ్చిన మగధీర, నాయక్, ఎవడు చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఇదే కాంబినేషన్లో వస్తున్న మా చిత్రం బ్లాక్ బస్టర్ కొడుతుందని నమ్ముతున్నాను అన్నారు.

రామ్ చరణ్ క్లాప్...
రామ్ చరణ్ దేవుడి పటాలపై చిత్రీకరించి సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, సత్యరంగయ్య ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసారు. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేసారు.

ప్రముఖులు...
చిత్ర ప్రారంభోత్సవం నిరాడంబరంగా ఫిలింనగర్ దైవ సన్నిదానంలో పూజా కార్యక్రమాలతో జరిగింది. పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

రామ్ చరణ్, కాజల్ హిట్ కాంబినేషన్
ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్.

షూటింగ్ వివరాలు
షూటింగు విషయానికొస్తే...ఈ రోజు ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరుగనుంది. ఆ తర్వాత దాదాపు 40 రోజుల పాటు రామేశ్వరం, నాగర్ కోయిల్, పొల్లాచ్చిలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ చేయబోతున్నాం. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అన్నారు.


Click it and Unblock the Notifications











