రామ్ చరణ్ నయా లూక్ అదుర్స్.. బుచ్చిబాబు ప్లాన్ అదేనా?
Ram Charan Latest Look: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'గేమ్ చేంజర్' గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ అండ్ యూత్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో మరో సినిమాపై దృష్టి సారించారు రామ్ చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఆర్సీ 16 సినిమాలో నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లుక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ లుక్ ఏలా ఉండో చూసేయండి..
రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ' గేమ్ చేంజర్' మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. జనవరి 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ మూవీ పై భారీ అంచనాలను పెంచేశాయి. మరోవైపు.. ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రారంభమైంది, అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతోంది.

ఇలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని రామ్ చరణ్ కసిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పలు అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా.. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమిళ దర్శకులు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించగా.. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ను డల్లాస్ లో నిర్వహించబోతున్నారు. గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కుమార్ ను ముఖ్య అతిథిగా పిలువనున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ మూవీ తర్వాత రామ్ చరణ్.. బుచ్చిబాబు ప్రాజెక్టుకు టైం కేటాయిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది. వచ్చే ఏడాది లోనే సుకుమార్ ప్రాజెక్టు కూడా సెట్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమా కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అనుకుంటున్నారు. ఇదెలా ఉంటే.. రాంచరణ్ లూక్ అదిరిపోయింది. అయితే.. రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ చూసి మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

తాజాగా సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్) కొత్త సినిమా 'సంబరాల ఏటిగట్టు' అనే టైటిల్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ నయా లుక్ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. చిట్టిబాబు పాత్రను మించేలా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. రామ్ చరణ్ నయా లుక్ లో గుబురు గడ్డం, చెవికి పోగు చూస్తుంటే విలేజ్ బ్యాక్ గ్రౌండ్ కథనం సాగేలా ఉన్నట్టుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథనంలో మూవీ తెరకెక్కుతున్నట్లు అర్థమవుతుంది.
ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తూండగా.. కన్నడ శివన్న, మీర్జాపూర్ మున్నాభాయ్య, జగపతిబాబు వంటి నటులు ముఖ్యపాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చూసి బుచ్చిబాబు ఓ లెవల్లో మూవీ మేకింగ్ చేస్తున్నాడు కదా అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ వర్షాన్ని కురిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ ఫోటోలు అవుతున్నాయి


Click it and Unblock the Notifications











