తెల్లవారుజామున రామ్ చరణ్ ఇష్టమైన కష్టాలు.. ఆ ఫిట్నెస్ ఏంటి సామీ?

ఒక స్టార్ హీరోగా సక్సెస్ అవ్వడం అనేది కొంతమంది చాలా ఈజీ అనుకుంటారు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా యాక్టర్ లో మ్యాటర్ లేకపోతే జనాలు చూడమన్నా చూడరు. ఇక హీరోగా ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలి కాబట్టి దాని వెనుక పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇక మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు మెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎంత కష్టపడతాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఉదయమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఎదో ఒక కొత్త ప్రయోగం

ఎదో ఒక కొత్త ప్రయోగం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా సినిమాకు తన గ్రాఫ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. కేవలం కథల ఎంపికతోనే కాకుండా నటుడిగా తనను తాను ఎంతగానో మార్చుకుంటున్నాడు. కమర్షియల్ గా రొటీన్ సినిమాలు చేయకుండా ఎదో ఒక కొత్త ప్రయోగాన్ని చూపిస్తూ వస్తున్నాడు.

విమర్శకులకు కౌంటర్

విమర్శకులకు కౌంటర్

రంగస్థలం సినిమాతో విమర్శకులకు కౌంటర్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ ఆ తరువాత ఫిట్నెస్ తో సరికొత్తగా ఆకట్టుకున్నాడు. వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ ఫిట్నెస్ లెవెల్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు అంతకుమించి అనేలా రెడీ అవుతున్నాడు. RRRలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

చీరకట్టులో హంస నందిని సోయగాలు... స్లీవ్ లెస్ జాకెట్‌తో మరింత అందంగా

ఫిట్నెస్ విషయంలో..

ఫిట్నెస్ విషయంలో..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ బిగ్ బడ్జెట్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల కలయికపై అభిమానుల్లో అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇక ఇద్దరు కూడా ఫిట్నెస్ విషయంలో ఎంతగానో కష్టపడ్డారు. పూటకొక డైట్ పాటించారు.

ఆ ఫిట్నెస్ ఏంటి సామీ

ఆ ఫిట్నెస్ ఏంటి సామీ


ఇక మంగళవారం ఉదయాన్నే రామ్ చరణ్ పోస్ట్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్ట్రాంగ్ మార్నింగ్ అంటూ రామ్ చరణ్ ఇచ్చిన స్టిల్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తోంది. ఆ ఫిట్నెస్ ఏంటి సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా రామ్ చరణ్ వర్కౌట్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. మరి RRRలో అల్లూరిగా ఎలాంటి కిక్కిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X