రామ్ చరణ్‌తో... ‘మిస్టర్ పెళ్లికొడుకు’ ఆడియో

By Bojja Kumar

హైదరాబాద్: మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ సునీల్-ఇషా చావ్లా జంటగా రూపొందిస్తున్న చిత్రం 'మిస్టర్ పెళ్లి కొడుకు'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం రేపు(ఫిబ్రవరి 2) శిల్పకళా వేదికలో జరుగనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో ఆవిష్కరించనున్నారు.

ఆర్ బి చౌదరి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ... హిందీలో విజయవంతమైన 'తను వెడ్స్ మను' ఆధారంగా మన తెలుగు నేటివిటీకి కావాల్సిన అన్ని మార్పుల్ని చేసి ఈ చిత్రాన్ని చేస్తున్నాం. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.

నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ... ఆద్యంతం అన్ని తరగతుల వారిని నవ్వించే చక్కని కథా చిత్రమిది. తన పాత్రలో సునీల్ పూర్తిగా ఇన్ వాల్వ్ అయి నటించారు. వీలైతే ఈ నెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని అన్నారు. మరో నిర్మాత పరాస్ జైన్ మాట్లాడుతూ మా సంస్థ పర్మినెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఏ.రాజ్ కుమార్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆరు పాటల్ని అద్భుతంగా చేసారు. సునీల్ ఈ చిత్రంలో నటించడం కంటే జీవించాడని చెప్పడం బెటర్. ఈ చిత్రం తర్వాత దేవిప్రసాద్ పెద్ద దర్శకుల జాబితాలో చేరుతాడు. కెమెరామెన్ సమీర్ సునీల్‌ని ఎంతో గ్లామరస్ గా చూపించాడని చెప్పుకొచ్చారు.

సునీల్ సరసన ఇషా చావ్లా నటించిన ఈ చిత్రంలో అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్.బి.శ్రీరామ్, ఆహుతిప్రసాద్, రవిబాబు, ఎం.ఎస్. నారాయణ, తులసి, ఉషశ్రీ, అర్చన, భవాని ముఖ్య పాత్రలు పోషించారు. విలన్ గా విన్సెంట్ అనే కొత్త నటుడు పరిచయం అవుతున్నాడు. ఈచిత్రానికి సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్, కెమెరా: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎం.ఎస్. రవికుమార్, ఫైట్స్: కనల్ కణ్ణన్, ఎడిటింగ్: నందమూరి హరి, కో డైరెక్టర్స్: ఎన్.బ్రహ్మాజీ, విజయ్ కుమార్, ప్రొడక్షన్: భీమనేని రాయుడు, సమర్పణ: ఆర్.బి.చౌదరి, నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవి ప్రసాద్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X