హైప్ రావాలనే... రామ్ చరణ్‌తో ప్లాన్ చేసిన సుకుమార్
రామ్ చరణ్ చేతుల మీదుగా ‘దర్శకుడు’ ఆడియో రిలీజ్ కానుంది.
అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం 'దర్శకుడు'. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఆగస్టు 4న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ నెల 15న జరుగనున్న ఈ చిత్ర పాటల వేడుక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ చేతుల మీదుగా ఈ పాటలను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆయన చేతుల మీదుగా మా పాటలు విడుదలకానుండటం మాకెంతో ఆనందంగా వుంది అని తెలిపారు.
అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.


Click it and Unblock the Notifications











