twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామచరణ్ నెక్ట్స్ స్పెషల్...

    By Staff
    |

    చిన్నప్పుడు నేర్చుకున్న హార్స్ రైడింగ్ విన్యాసాలను మగధీర చిత్రంలో చూపిన రామ్ చరణ్ ఈ సారి మరోసారి తనలో దాగిన మరో స్కిల్ ని వెలికితీయటానికి రెడీ అవుతున్నాడు. అది మరేదో కాదు స్కై డైవింగ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న చిత్రంలో స్కై డైవింగ్ కి సంభందించిన కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేసారని సమాచారం. ఇన్నాళ్లు హీరోల బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథలు రూపొందించే దర్శకులు ఇప్పుడు వారిలో దాగిఉన్న స్కిల్స్ ని ఉపయోగించుకునే దిశలో కథనాలు అల్లుతున్నారు. ఇక ఈ కొత్త చిత్రంలో అధికభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ స్కై డైవింగ్ ని ఇప్పటికే నేను నేర్చుకునేర్చుకున్నాను. ఆ విన్యాసాలను నేను భాస్కర్ చిత్రంలో ప్రదర్శంచబోతున్నాను. వాటిని న్యూయార్క్ లో చిత్రీకరిస్తారు..అని చెప్పాడు. ఇక ఈ నూతన చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా, భాస్కర్ కాంబినేషన్ లో గతంలో బొమ్మరిల్లు సినిమా వచ్చి సూపర్ హిట్ కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మిస్తున్నారు. భాస్కర్..పరుగు చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X