రామ్ చరణ్... జంజీర్ లుక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన బాలీవుడ్ డెబిట్ మూవీ 'జంజీర్' షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రంలో చెర్రీ టఫ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాలో చెర్రీ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో ఇంకా బయటకు రాలేదు కానీ...జంజీర్ షూటింగులో స్పాట్‌లోని ఓ ఫోటోను చరణ్ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు.
పోలీస్ ఆఫీసర్ పాత్రలో పర్‌ఫెక్టుగా కనిపించడానికి చరణ్ జిమ్ లో చాలా వర్కౌట్లు చేస్తున్నాడట. ఇందులో షర్ట్ లేకుండా కనిపిస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. తాజా రీమేక్‌లో ఈ చిత్రంతో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'జంజీర్' చిత్రంపై గత కొంత కాలంగా వివాదం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. జంజీర్ ఒరిజినల్ వెర్షన్ రచయితలు అయిన సలీమ్, జావేద్ అక్తర్‌లు తమ కథను మళ్లీ రీమేక్ చేయడానికి తమ అనుమతి తీసుకోలేదని, తమ స్టోరీని వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో వారు తాజాగా లీగల్ నోటీసులు పంపారు. దీంతో రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా 'జంజీర్' వివాదం కోర్టుకెక్కక తప్పేట్లు లేదు.


Click it and Unblock the Notifications











