2009 విజయాన్ని తిరగరాస్తా ‘మగధీరు’డు
రామ్ చరణ్ 2007లో 'చిరుత" గా విజృంభించి 2009 లో 'మగధీర" గా అద్భుతమైన విజయాన్ని సాధించి తెలుగు సినిమా చరిత్రలో రికార్డులు నెలకొల్పిన రామ్ చరణ్ 2010లో కూడా అటువంటి విజయాన్నే సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. తన రెండవ చిత్రంతోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ తర్వాత చిత్రం 'ఆరెంజ్". ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు నాగబాబు నిర్మాత. జెనీలియాతో పాటు మరో బాలీవుడ్ అమ్మాయి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో తమిళనటుడు ప్రభు ఓ ప్రధాన పాత్ర పోషిస్తుండగా మరో హీరో సుమన్ కూడా ఓ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో సుమన్ పాత్ర సినిమాకు ఎంతో కీలకం అంటున్నాడు దర్శకుడు. అయితే భాస్కర్ ప్రతి చిత్రంలో ప్రకాష్ రాజ్ కు ఓ ప్రత్యేక పాత్ర వుంటుంది. ఆ పాత్రను ఈ చిత్రంలో సుమన్ చేత చేయిస్తున్నాడా! ఎందుకంటే ఇంత వరకు ప్రకాష్ రాజ్ మాట రాలేదు. అనుకుంటున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఈ చిత్రంలో గెస్ట్ పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని చరణ్ ఖాతాలో మరో బిగ్ హిట్ కు రెడీ అవుతుందని ఈ చిత్రం నిర్మాత నాగబాబు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











