కేక పెట్టిస్తున్న రాంచరణ్ లుక్, అల్లూరి గెటప్‌లో.. వరుణ్ తేజ్‌తో లంచ్!

Recommended Video

Ramcharan Selfie With Varun Tej Goes Viral | RRR | Vaalmiki | Filmibeat Telugu

రాజమౌళి మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ చిత్రం గురించి చర్చ మొదలైంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1920 కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు యుక్త వయసులో ఉన్న సమయంలో కొన్నేళ్లు అదృశ్యమై తిరిగి వచ్చి స్వాతంత్ర పోరాటం చేశారు. అదృశ్యమైన సమయంలో వీరిద్దరూ ఎలా ఉండేవారు అనేదే ఈ చిత్ర కథ అని రాజమౌళి తెలిపారు. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. తాజాగా రాంచరణ్ వరుణ్ తేజ్ తో తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎలా ఉండబోతున్నారు

ఎలా ఉండబోతున్నారు

ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాలు అందించేందుకు రాజమౌళి ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ మీసాలతో కనిపించారు. అల్లూరిగా చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రై చేస్తున్నట్లు అర్థం అయింది. అభిమానులకు ఫస్ట్ లుక్ లాంటి కానుకలు ఇప్పట్లో ఉండవని రాజమౌళి తేల్చేశారు. దీనితో చరణ్, ఎన్టీఆర్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువవుతోంది.

వరుణ్ తేజ్‌తో లంచ్

వరుణ్ తేజ్‌తో లంచ్

రాంచరణ్, వరుణ్ తేజ్ ఇటీవల ఓ చోట లంచ్ లో మీట్ అయ్యారు. రాంచరణ్ తీసిన సెల్ఫీని వరుణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సోదరుడి ప్రేమ అని కామెంట్ పెట్టాడు. అసలు ఇంతకీ వీరిద్దరూ ఎక్కడ కలిశారు అంటూ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా చరణ్ తీసిన ఈ సెల్ఫీతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రాంచరణ్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అల్లూరి సీతారామరాజుగా

అల్లూరి సీతారామరాజుగా

సెల్ఫీలో రాంచరణ్ అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నాడు. లైట్ గా గడ్డం, బాగా మీసాలు పెంచి అల్లూరి పాత్ర కోసం సిద్ధం అవుతున్నాడు. రాంచరణ్ కొత్త లుక్ సూపర్ స్టైలిష్ గా ఉందంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. హెయిర్ కూడా బాగా పెంచుతున్నట్లు అనిపిస్తోంది. మగధీర చిత్రంలో చరణ్ మీసాలతో, హెయిర్ బాగా పెంచి కనిపించాడు. దాన్ని తలదన్నేలా అల్లూరి పాత్రలో రాంచరణ్ లుక్ ఉండబోతోందని సమాచారం.

త్వరలో పూణే షెడ్యూల్

త్వరలో పూణే షెడ్యూల్

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ త్వరలో పుణేలో భారీ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతోంది. 40 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో చరణ్, ఎన్టీఆర్ పై రాజమౌళి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక వరుణ్ తేజ్ హరీష్ శంకర్ దర్శత్వంలో తెరకెక్కే వాల్మీకి షూటింగ్ కోసం సిద్ధం అవుతున్నాడు.తమిళ హిట్ చిత్రం జిగర్తాండకు ఇది తెలుగు రీమేక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X