'రోబో' ని చూసిన కళ్ళతో 'మగధీర' ని మెచ్చుకుంటారా?
రజనీకాంత్ రోబో చిత్రం టెక్నికల్ గా కొన్ని స్టాండర్డ్ ని తీసుకు వచ్చింది. ఈ సమయంలో తమిళంలో రామ్ చరణ్ మెగా హిట్ మగధీర ను డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇన్నాళ్ళూ సరైన సమయం రావాలంటూ ఎదురుచూసి ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సమయంలో రోబో చూసిన కళ్ళతో మగధీర చూడగరా..ఆనుతుందా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రోబో రాక ముందు ఉన్న క్రేజ్ ఇప్పుడు మగధీరకు టెక్నికల్ పరంగా రాకపోవచ్చునేమో కానీ కథాపరంగానూ, నటనాపరంగానూ ఈ చిత్రం ఉన్నతంగా ఉంటుందని మరికొందరంటున్నారు. 'మగధీర" తమిళంలో 'మన్నాది మన్నన్" పేరుతో అనువాదమవుతోంది.
ఇక తన చిత్రాలకు మాత్రమే మాటలు రాసుకునే నటుడు, రచయిత, దర్శకుడు కె. భాగ్యరాజా తొలిసారి 'మన్నాది మన్నన్" కు మాటలు రాసారు. అలాగే సీనియర్ గేయ రచయిత వాలి పాటలు రాయించారు. ఈ చిత్ర తమిళ హక్కులను కలైపులి యస్. ధాను సొంతం చేసుకున్నారు. 60వ దశకంలో యం.జి.ఆర్ నటించిన 'మన్నాది మన్నన్" టైటిల్ తో తెలుగు మగధీర తమిళంలోకి ఈ నవంబర్ నెలలోనే అడుగుపెడుతున్నాడు. రామచరణ్ తమిళంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం విశేషం. అలాగే ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా రావటంతో మంచి క్రేజ్ వచ్చింది.


Click it and Unblock the Notifications











