వైరల్ వీడియో : అందుకే అతను నా హీరో.. భర్తపై ప్రేమను కురిపించిన ఉపాసన

వెండితెరపై వంద మందిని నరికితే రీల్ హీరోలు అవుతారు.. అదే శ్రీమతి హృదయాన్ని గెలుచుకుంటే రియల్ లైఫ్ హీరోలు అవుతారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన మనసును గెలుచుకున్నాడు. రామ్ చరణ్ చేసిన పనికి ఉపాసన ఉప్పొంగిపోయింది. భర్తపై ప్రేమను కురిపిస్తూ.. అందుకే అతను నా హీరో అంటూ కొనియాడింది. ఇంతకీ రామ్ చరణ్ ఏం చేశాడు, ఉపాసన ఆనందానికి కారణం ఏంటి? అనేది ఓ సారి చూద్దాం.

సెలెబ్రిటీలంతా ఇంట్లోనే..

సెలెబ్రిటీలంతా ఇంట్లోనే..

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ సెలెబ్రిటీలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. అందులో కొందరు ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉంటే మరికొంత మంది తదుపరి చిత్రాలకోసం వర్కౌట్టు చేస్తున్నారు.

వంటింట్లో సెలెబ్రిటీలు..

క్షణకాలం కూడా తీరిక లేకుండా బిజీగా ఉండే సెలెబ్రిటీలంతా లాక్ డౌన్ పుణ్యమా అని అందరూ ఇంటి పట్టునే ఉంటారు. స్టార్ హీరోయిన్స్ వంటింట్లో చేరి కొత్త కొత్త వంటకాలను నేర్చుకుంటున్నారు. తాజాగా హీరోలు కూడా ఈ జాబితాలో చేరిపోయారు. మంచు విష్ణు కొబ్బరి బోండాలో కొత్త వంటకం ట్రై చేశాడు. తాజాగా రామ్ చరణ్ కూడా గరిట పట్టాడు.

అందుకే నా హీరో..

అందుకే నా హీరో..

రామ్ చరణ్ వంటింట్లో గరిట తిప్పుతున్న వీడియోను షేర్ చేస్తూ.. తన కోసం రామ్ చరణ్ వంట వండుతున్నాడని బయటున్న భర్తలందరికీ ఓ సందేశాన్ని ఇచ్చింది. నా కోసం డిన్నర్ వండాడు.. మళ్లీ వంటగదిని మొత్తం క్లీన్ చేశాడు.. అదే అతడ్ని నా హీరోగా చేశాయి..అంటూ భర్తపై ప్రేమను కురిపించింది.

Recommended Video

NTR31 Film With Atlee, Will Be Another Big Pan India Movie
డబ్బింగ్ పనులతోనూ బిజీ..

డబ్బింగ్ పనులతోనూ బిజీ..

రామ్ చరణ్ ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటుండగా.. మరోవైపు ఆర్ఆర్ఆర్ పనులను కూడా పూర్తి చేస్తున్నాడని తెలుస్తోంది. రాజమౌళి ఆదేశాలతో డబ్బింగ్ పనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తమ పాత్రలకు డబ్బింగ్ చెబుతున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X