పార్టీ చేసుకుంటూ చిక్కిన రామ్ చరణ్, మనోజ్ (ఫోటో)

తండ్రుల తీరు అలా ఉంటే.....వీరి వారసుల తీరు పూర్తి భిన్నంగా ఉంది. తమ తండ్రులు ఎలా ఉన్నా తాము మాత్రం మంచి స్నేహితలమే అంటున్నారు. ఇందుకు నిదర్శనంగా ఇటీవల మంచు మనోజ్ తన ట్విట్టర్లో ఓ ఫోటో పోస్టు చేసాడు. ఓ పార్టీలో రామ్ చరణ్‌తో మంచి టైం గడిపాను అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.
ఇక ఈ యంగ్ హీరోల సినిమాల విషయానికొస్తే....ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ కృష్ణ వంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం మనోజ్ జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలోనే ఉంది. దీనికంటే ముందు మనోజ్ నటించిన చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద'. ఈ చిత్రంలో మనోజ్ పోషించిన లేడీ గెటప్ సినిమాకు హైలెట్‌గా మారడంతో పాటు మంచి వినోదం పంచింది.


Click it and Unblock the Notifications











