రామ్ చరణ్-ఉపాసన పెళ్లి తేదీ ఖరారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ-ఉపాసన కామినేని త్వరలో పెళ్లి ద్వారా ఏకమౌతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో జరిగింది. తాజాగా వీరి పెళ్లి తేదీని ఉపాసన కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఉపాసన తాత, అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి పెళ్లి విషయమై సోమవారం మీడియాతో మాట్లాడుతూ...జూన్ 13న వివాహ ముహూర్థం నిశ్చయించినట్లు తెలిపారు.
ఉపాసన, రామ్‌చరణ్‌లది చక్కని జంట అని ప్రశంసించారు. పెళ్లి ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నామన్నారు. తనకు తిరుపతి పుట్టినిల్లు లాంటిదని చిరంజీవి చెప్పడంతో దైవం చెంతనే రిసెప్షన్‌ను తన స్వగ్రామమైన అర్ధగిరిలో ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.
కాగా వీరి వివాహానికి దేశంలోని అన్ని సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, కేంద్ర స్థాయిలోని బడా రాజకీయ నాయకులు, వ్యాపారులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన నిశ్చి తార్థ వేడుకకు అభిమానులకు చోటు లేకుండా పోయింది. ఈ పెళ్లి వేడుకలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారా? లేదా అనే అంశం కూడా సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











