రామ్‌చరణ్ పెళ్ళి వార్త నిజమైంది
రామ్ చరణ్, అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకులు ప్రతాప్‌రెడ్డి మనవరాలు ఉపాసనాకు వివాహం జరగనుందనే వార్త గత కొంత కాలంగా మీడియాలో నలుగుతున్న సంగతి తెలిసిందే.ఆ వార్త నిజమైంది్. ప్రతాప్‌రెడ్డి మూడవ కుమార్తె శోభన కామినేని, అనిల్‌ల తనయ ఉపాసనాను రామ్‌చరణ్ వివాహమాడబోతున్నారనే వార్త శనివారం వెలువడింది. ఈ విషయాన్ని శోభన కామినేని మీడియాకు ధ్రువీకరించారు. చిరంజీవి జన్మదినమైన ఆగస్టు 22న రెండు కుటుంబాలు వివాహానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారికంగా ప్రకటిస్తాయి. రామ్‌చరణ్ ఇప్పటికే రచ్చ షూటింగ్ లో బీజీ కాగా, ఉపాసనా ప్రస్తుతం అపోలో లైఫ్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉపాసనా బ్లూక్రాస్‌లో క్రియాశీలక సభ్యురాలిగా పనిచేస్తూనే సర్వైకల్ క్యాన్సర్, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో కీలక ప్రచార బాధ్యతలు చూస్తున్నారు.ఇక రామ్ చరణ్ కి ధట్స్ తెలుగు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











