అలా అభిమాని కోరింది.. ఇలా రామ్ చరణ్ వచ్చేశాడు.. దటీజ్ మెగా పవర్ స్టార్
సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎవరిపైనా కామెంట్ చేయవచ్చు. తమ అభిప్రాయాలను, అభిమానాన్ని, ప్రేమను నేరుగా చూపించవచ్చు. తమ ఆరాధ్య దైవాలుగా భావించే హీరోల మీద వారి వారి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రేమను వ్యక్త పరుస్తుంటారు.అయితే ఇందులో ఒక్కో అభిమాని ఒక్కోలా తమ ప్రేమను తెలుపుతారు. కొన్నిసార్లు వాటికి సదరు హీరోలు స్పందిస్తుంటారు. అభిమానుల కోరిక మేరకు వారిని కలుస్తుంటారు.

హీరోలు సైతం..
టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తమ అభిమానుల ప్రేమను కళ్లారా సోషల్ మీడియాలో చూస్తుంటారు. కొన్ని సార్లు కొంతమంది హీరోలు తమ అభిమానులకు రిప్లైలు ఇస్తుంటారు. కొందరైతే ఏకంగా ఇంటికి కూడా ఆహ్వానిస్తూ కాస్త సమయాన్ని గడుపుతుంటారు.

రామ్ చరణ్ ఫ్యాన్..
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమాని ఒకరు అలానే సోషల్ మీడియాలో ఓ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. 'నమస్కారములు రామ్ చరన్ గారు నా పేరు శ్రీమతి సుదర్శన్ బొడ్డు
నేను మీకు పెద్దఫ్యాన్‌ని నేను..... ఊడ్చే చీపురు పుల్లలతో మీయొక డ్రీమ్ హౌస్‌ని నిర్మించాను దీనిని మీకు ఇవ్వాలనుకుంటున్నాను మీరు అనుమతి ఇస్తే కలిసి ఇవ్వాలని నా కోరిక' అని పోస్ట్ చేశారు.

స్పందించిన చెర్రీ..
అయితే అంత ప్రేమగా అభిమాని అడిగాక ఏ హీరో అయినా కాదనకుండా ఉంటాడు. రామ్ చరణ్ తన అభిమానిని కలిశాడు. ఆమె తన నైపుణ్యంతో కట్టిన డ్రీమ్ హౌస్‌ను తీసుకున్నారు. చీపురు పుల్లలతో కట్టిన ఆ ఇంటిని రామ్ చరణ్ ప్రేమగా స్వీకరించాడు.

ఫోటోలు వైరల్..
ఈ మేరకు తన అభిమానిని, ఆమె కుటుంబ సభ్యులను కలిసి కాసేపు ముచ్చటించారు. ఎంతో ప్రేమగా కట్టిన ఆ డ్రీమ్ హౌస్‌ను తీసుకున్నాడు రామ్ చరణ్. ఈ మేరకు తన అభిమానితో దిగిన రామ్ చరణ్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దటీజ్ మెగా పవర్ స్టార్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

బర్త్ డే సెలెబ్రేషన్స్..
రామ్ చరణ్ బర్త్ డే(మార్చి 27) సెలెబ్రేషన్స్ శిల్పా కళా వేదికలో గ్రాండ్‌గా జరగబోతోన్నాయి. అయితే సీడీపీపై మాత్రం ఓ రేంజ్‌లో వివాదం నెలకొంది. రామ్ చరణ్ బర్త్ డే సీడీపీ ఏమీ బాలేదని ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల నుంచి అప్డేట్లు రాబోతోన్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











