రామ్ చరణ్ కి దొరికితే ఫుట్ బాల్ ఆడుకొంటాడట...

By Sindhu

ఉన్న ఫలంగా మన తెలుగు హీరోలందరూ ఫుట్ బాల్ క్రీడ మీద పడ్డారు. 'కత్తి" సినిమాలో కళ్యాణ్ రామ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుంటే..రామ్ చరణ్ తేజ్ తదుపరి చిత్రం 'మెరుపు" కూడా ఫుట్ బాల్ నేపధ్యంలో రూపొందనుందని తెలుస్తోంది. 'ఆరెంజ్" అనంతరం రామ్ చరణ్ తేజ్ తో సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లో ఆర్ బి చౌదరి నిర్మించే 'మెరుపు"చిత్రానికి తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫుట్ బాల్ గేమ్ ముఖ్య పాత్ర పోషించనుంది. 'రామ్‌ చరణ్‌ ఇందులో 'మెరుపు" లాంటి యువకుడి పాత్రను పోషిస్తున్నారు. ఆ మెరుపును ఎవరు పట్టు కోలేరు. ఒక లక్ష్యం కోసం కష్టపడి తాను అనుకున్నది సాధించే పాత్ర.

క్రికెట్ లో మాదిరిగానే ఫుట్ బాల్ గేమ్ లోనూ జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాల్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారంట. అంతే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఈ గేమ్ మన ఇండియాలో ఎందుకు ప్రాచుర్యం పొందలేకపోతున్నదనే విషయాన్ని కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నామంటూ రామ్ చరణ్ చెబుతున్నాడు. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ ఎవరెవర్ని ఫుట్ బాలాడుకుంటాడో ..ఈ ఫుట్ బాల్ ప్లేయర్ కి కాజల్ ఎలా ఎంకరేజ్ మెంట్ ఇస్తుందో తెలుసుకోవాలంటే కనీసం ఆరేడు నెలలయినా ఆగాల్సిందే..మగధీర తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవటంతో మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X