రామ్ చరణ్ మదర్స్ డే విషెస్ ఇలా... (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: మదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి సెల్ఫీ ఫోటో పోస్టు చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు. ‘హ్యాపీ మదర్స్ డే...ఐ లవ్ యు మా' అని చెప్పుకొచ్చారు. నేను ఇప్పటికీ అమ్మ చాటు పిల్లాడినే, అమ్మకు నేనే ఫేవరెట్ అంటూ రామ్ చరణ్ ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే...
రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మార్చి 16న ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత డివివి దానయ్య ‘డివివి ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Happy Mother's Day!!! Love you maa.

Posted by Ram Charan on Sunday, May 10, 2015

ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారుకాలేదు. ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ హైదరాబాద్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు."నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X