For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇది వైరస్ కన్నా ప్రమాదం: వీడియోతో ముందుకొచ్చిన రామ్ చరణ్, ఎన్టీఆర్

  |

  కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఓ వైపు అన్ని దేశాల ప్రభుత్వాల వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కరోనా విజృంభణకు బ్రేకులు పడటం లేదు. దీంతో ప్రజలు భాయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయం పోగొట్టేందుకు గాను యంగ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి పోతే..

  భయం భయం.. రామ్ చరణ్, ఎన్టీఆర్

  భయం భయం.. రామ్ చరణ్, ఎన్టీఆర్

  యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. మనదేశంలోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో ప్రజల్లో ఉన్న భయం పోగొట్టి, కరోనా పట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించేందుకు గాను పలువురు సెలెబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఇదే బాటలో తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కొన్ని సూచనిలిస్తూ వీడియోతో ముందుకొచ్చారు.

   ఈ ఆరు సూత్రాలు పాటిస్తే..

  ఈ ఆరు సూత్రాలు పాటిస్తే..

  కరోనా వైరస్ మన దరి చేరకుండా ఉండటానికి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు అని ఆ ఇద్దరు హీరోలు చెప్పుకొచ్చారు. WHO సూచించిన ఈ ఆరు సూత్రాలు పాటిస్తే మనం COVID -19 నుంచి చాలా సులువుగా బయటపడగలం. భయపడాల్సిన పని లేదని చెప్పారు.

   రోజుకు 7 నుంచి 8 సార్లు చేయాలి

  రోజుకు 7 నుంచి 8 సార్లు చేయాలి

  చేతులు సబ్బుతో మోచేతుల వరకు శుభ్రంగా కడుక్కోండి. బయటకు వెళ్లొచ్చినా, భోజనం చేసే ముందు.. ఇలా తరచుగా రోజుకు 7 నుంచి 8 సార్లు చేతులు శుభ్రపరుచుకోండి. తెలిసిన వాళ్ళు కలిసినా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానుకోవాలి. అనవసరంగా కళ్ళు, ముక్కు రుద్దుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు అని రామ్ చరణ్, ఎన్టీఆర్ చెప్పారు.

  అనవసరంగా మాస్కుల జోలికి పోవొద్దు..

  అనవసరంగా మాస్కుల జోలికి పోవొద్దు..

  మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనుకుంటేనే మాస్కులు ధరించాలి. లేకపోతే అనవసరంగా COVID -19 మీకంటుకునే ప్రమాదం ఉంది. జనం ఎక్కువగా ఉండే చోటుకి వెళ్ళకండి. మంచి నీళ్లు ఎక్కువ తాగండి. వేడి నీళ్లయితే ఇంకా మంచిది అన్నారు.

  అన్నీ నమ్మకండి.. అది చాలా ప్రమాదం

  అన్నీ నమ్మకండి.. అది చాలా ప్రమాదం

  వాట్సాప్‌లో వచ్చే ప్రతీ వార్తను నమ్మకండి. వాటిలో నిజమెంతో తెలియకుండా ఫార్వార్డ్ చేయకండి. అనవసరంగా పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదం. COVID -19 పై ప్రభుత్వం ఇస్తున్న సలహాలు పాటించి మనల్ని మనమే కాపాడుకుందాం. పరిశుభ్రత పాటిద్దాం. బీ సేఫ్.. అంటూ ముగించారు ఎన్టీఆర్, రామ్ చరణ్.

  Anukunnadi Okati Ayinadi Okati : Dhanya Balakrishna, Siddhi Idnani Request To Audience

  RRR మూవీ..

  ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ RRR మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

  English summary
  In Telangana state all theaters and public places could remain closed through the end of March as the government works to contain the virus, Deadline reported. Now Ntr, Ram Charan reated on this Corona effect.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X