‘నాయక్’ ఫస్ట్ హాఫ్ రాకింగ్ : తమన్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-క్రేజీ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న 'నాయక్' చిత్రం ఫస్ట్ హాఫ్ చాలా వినోదాత్మకంగా ఉంటుందని, ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతృప్తి పడే విధంగా ఉంటుందని ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ వెల్లడించారు.
ఇటీవల తమన్ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ హాఫ్ దర్శకుడు వివి వినాయక్ తో కలిసి వీక్షించాడట. అనంతరం తన ట్విట్టర్లో...'నాయక్ ఫస్ట్ హాఫ్ రాకింగ్, సూపర్ బ్లాక్ బస్టర్, ఇందులో ప్రతి బిట్ ను ఎంజాయ్ చేస్తారు, కామెడీ మరియు యాక్షన్ సూపర్, స్టంట్స్ అదిరిపోయాయి' అంటూ ట్విట్ చేసాడు.
ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న తమన్ ఇటీవలే ఈచిత్రం రికార్డింగ్ ఫినిష్ చేసాడు. ఈచిత్రంలోని పాటల పాడిన వారిలో ప్రముఖ బాలీవుడ్ సింగర్లు శ్రేయ ఘోషల్, శంకర్ మహదేవన్ లాంటి వారు ఉన్నారు. ఇక ఈ నెల 14న విడుదల కానున్న చిత్ర ఆడియో విడుదల కోసమే తమన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
యూనివర్సల్ మీడియా సంస్థ 'నాయక్'చిత్రాన్ని నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్‌రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











