రామ్ చరణ్ ‘నాయక్’ ఫస్ట్‌లుక్
హైదరాబాద్: రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'నాయక్ ' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ది లీడర్ అనేది ట్యాగ్ లైన్ . తాజాగా ఈచిత్రానకి సంబంధించి రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌ను వివి వినాయక్ తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ ద్వారా విడుదల చేశారు. ఇప్పటి వరకు ఫేస్ బుక్‌లో లేని వివి వినాయక్ రెండు రోజుల క్రితమే అకౌంట్ ఓపెన్ చేశారు. ఇకపై దీని ద్వారా రామ్ చరణ్ 'నాయక్' చిత్రానికి సంబంధించి అప్టేడ్స్ అందనున్నాయి.
రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుందట. పూర్తి కామెడీ, యాక్షన్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఫైట్స్ ని కనల్ కన్నన్ కంపోజ్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే గీతాన్ని రీమిక్స్ చేయనున్నారు. ''మాస్ అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథ ఇది. చరణ్ పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. 'ఠాగూర్' తరహాలో కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నాం. తమన్ బాణీలు హుషారుగా సాగిపోతాయ''ని ఇటీవల ఓ సందర్భంలో వినాయక్ చెప్పారు. సంక్రాంతికి ఈ సినిమా తెర మీదకు వస్తుంది. సమర్పణ: ఎస్.రాధాకృష్ణ, ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు.


Click it and Unblock the Notifications











