For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్‌చరణ్‌ ‘నాయక్’విడుదల తేదీ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా యూనివర్సల్‌ మీడియా సంస్థ 'నాయక్‌'చిత్రాన్ని నిర్మిస్తోంది. కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రాన్ని జనవరి 12,2013 న అంటే సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాత మీడియాకు తెలియచేసారు.

    ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ ''కథకి అనుగుణంగానే నాయక్‌ అనే పేరు ఖరారు చేశాం. రామ్‌చరణ్‌ పాత్ర తీరుతెన్నులు ఆయన నటించిన గత చిత్రాలకంటే భిన్నంగా ఉంటాయి..ఇది యాక్షన్ ఎంటర్టైనర్. ఈ నెల 20 నుంచి గ్రీకులో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకోనుంది''అన్నారు. ''అటు మాస్‌నీ ఇటు యువతనీ ఆకట్టుకొనే కథ ఇది. త్వరలోనే గ్రీస్‌లో సన్నివేశాల్ని తెరకెక్కిస్తామ''న్నారు చిత్ర సమర్పకుడు సూర్యదేవర రాధాకృష్ణ.

    నిర్మాత డి.వివి దానయ్య మాట్లాడుతూ...'ఈ కథకు 'నాయక్' అనే టైటిల్ సరిగ్గా యాప్ట్. పక్కా మాస్ అంశాలతో పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటే అద్భుతమైన కథను ఆకుల శివ అందించారు. ఈ సినిమాకు సంభాషణలు కూడా శివే అందించడం విశేషం. తమన్ సంగీతం, చోటా కె.నాయుడు ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా. ఈ నెల 20 నుంచి గ్రీకులో రామ్‌చరణ్, కాజల్ కాబినేషన్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం అన్నారు.

    అలాగే 'మగధీర' తర్వాత రామ్‌చరణ్, కాజల్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. అమలాపాల్ పాత్ర కూడా కథలో కీలకమైందే. రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నులు ఇందులో వైవిధ్యంగా ఉంటాయి. ఇప్పటివరకూ కనపించని కొత్త చరణ్ మా సినిమాలో కనిపిస్తాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్‌.

    English summary
    Coming with a tagline "The Leader", Ram Charan's Naayak will be a racy action entertainer and is scheduled for release for 2013 Sankranthi. Kajal Agarwal and Amala Paul are playing the female leads while SS Thaman is scoring the music. DVV Danayya is producing the movie under Universal Media banner. Nayak has already completed couple of shooting schedules and is gearing for another schedule in Greece from August 20.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X