For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ 'నాయక్' రిలీజ్ డేట్ (అపీషియల్)

  By Srikanya
  |

  హైదరాబాద్: వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం 'నాయక్‌'. 'ది లీడర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్ గా చేస్తున్నారు . ఈ చిత్రం విడుదల తేదీ ఫోస్ట్ ఫోన్ అయ్యే అవకాసం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై నిర్మాత డివివి దానయ్య ఖండించారు. ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసారు. ఆయన మాట్లాడుతూ.. '' నాయక్ విడుదల మీద వస్తున్న రూమర్స్ అన్నీ ఆధారం లేనివే. మొదట అనుకున్నట్లుగానే సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. జనవరి 9 న విడుదల చేస్తాం'' అని తెలిపారు.

  అలాగే సంఘ విద్రోహులకు ఎదురు తిరిగే యువకుడిగా చరణ్‌ పాత్ర ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. వినాయక్‌ శైలిలో మాస్‌, యాక్షన్‌ అంశాల్ని మేళవించారు అని చెప్పుకొచ్చారు. ఈ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్‌ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్‌ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము''అన్నారు.

  ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే గీతాన్ని రీమిక్స్‌ చేస్తున్నారు. ''మాస్‌ అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథ ఇది. చరణ్‌ పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. 'ఠాగూర్‌' తరహాలో కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నాం. తమన్‌ బాణీలు హుషారుగా సాగిపోతాయ''ని ఇటీవల ఓ సందర్భంలో వినాయక్‌ చెప్పారు. సమర్పణ: ఎస్‌.రాధాకృష్ణ, ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు.

  రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ తీరిక లేకుండా కష్ట పడుతున్నాడు చరణ్. మగధీర' తర్వాత కాజల్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

  English summary
  Putting an end to all the speculation that the movie's release might be postponed, producer DVV Danayya announced on Sunday that the release date of Ram Charan's Nayak will be January 9, 2013. "The rumors about postponement of the Nayak's release are baseless and the film will release as scheduled for the festive season", said Danayya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X