twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెర్రీ నాయక్ దుమారం: పోలీసులకు ఫిర్యాదు

    By Pratap
    |

    విశాఖపట్నం: రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన నాయక్ చిత్రంపై తలెత్తిన వివాదం ముదురుతోంది. నాయక్‌లో విలన్ పేరుకు తన పేరు పెట్టినందుకు అగ్గి మీద గుగ్గిలం అవుతున్న మాజీ శానససభ్యుడు గండి బాబ్జీ సినిమా దర్శకుడు వినాయక్, నిర్మాత దానయ్యలపై మంగళవారంనాడు విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరువు నష్టం దావా వేసేందుకు కూడా ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.

    రామ్ చరణ్ తేజ, కాజల్, అమలపాల్ నాయకానాయికలుగా డివివి దానయ్య నిర్మాణంలో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ చిత్రంలో విలన్ పేరు మార్చాలంటూ విశాఖ జిల్లా మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ ఇటీవల ఆందోళనకు దిగారు. చిత్రంలో విలన్ పాత్రకు తన పేరును పోలిన పేరు ఉండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ఆ పేరును ఉద్దేశ్యపూర్వకంగానే పెట్టినట్లుగా బాబ్జీ అభిప్రాయపడ్డారు.

    గండి బాబ్జీ జిల్లాలోని పెందుర్తిలో ఈ నెల 9వ తేదీన ఆందోళనకు దిగారు. తక్షణమే పేరు మార్చాలని అతను నిర్మాతను, దర్శకుడిని కోరారు. రేపటిలోగా సినిమాలో విలన్ పాత్రధారి పేరు మార్చాలన్నాడు. లేదంటే దర్శకుడి పైన తాను క్రిమినల్ కేసు పెట్టేందుకు కూడా వెనుకాడే ప్రసక్తి లేదన్నాడు. కాగా ఇందుకు సంబంధించి గండి బాబ్జీ దర్శకుడు వివి వినాయక్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లుగా సమాచారం. వినాయక్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

    కాగా రామ్ చరణ్ తేజ హీరోగా, కాజల్, అమలపాల్ హీరోయిన్లుగా నటించిన నాయక్ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ పాత్రధారి రాహుల్ దేవ్ పేరును గండిపేట బాబ్జిగా చూపించారు. అతనో డాన్. సినిమాలోని గండిపేట బాబ్జీ పేరు, ఆందోళన చేపట్టిన గండి బాబ్జీ పేర్లు దగ్గరగా ఉన్నాయి.

    నాయక్ చిత్రం ఫరవాలేదనే టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో తన తండ్రి చిరంజీవి 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని మాత్రమే రీమిక్స్‌ చేశారు.

    English summary
    Former MLA Gandi Babji has made complaint against Ram Charan Tej's Nayak film director VV Vinayak and producer Danaiah.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X