twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెర్రీ ‘నాయక్’ అక్కడ తొలి ఇండియన్ మూవీ!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్లో 'నాయక్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈచిత్రం ఏ భారతీయ సినిమా ఇప్పటి వరకు చిత్రీకరణ జరుపుకోనటువంటి రేర్ లొకేషన్లో షూటింగ్ జరుపుకుంది. స్లోవేనియా దేశంలో రామ్ చరణ్, కాజల్‌లపై పాటల చిత్రీకరణ జరిపారు. స్లోవేనియా సెంట్రల్ యూరఫ్ లోని ఒక చిన్న దేశం. ఈ దేశ జనాభా కేవలం 20 లక్షలు మాత్రమే. ఇక్కడ అబ్బుర పరిచే పోస్టోజ్నా భూగర్బ గుహలు, అందమైన రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్న 'నాయక్' తొలి భారతీయ సినిమా రికార్డు దక్కించుకుంది.

    ఇక్కడ షూటింగ్ ప్రారంభం కాగా... ఈ దేశ క్యాపిటల్ సిటీ మేయర్ జోరాన్ జంకోవిక్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. రామ్ చరణ్ 'నాయక్' చిత్రం పుణ్యమా అని ఇక్కడ భారతీయ సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల షూటింగుల తాకిడి పెరుగుతుందని, తద్వారా తమ ఆదాయం పెరుగుతుందని అక్కడి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. తాజాగ గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ను కూడా స్పెషల్ సాంగు కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ హీరో కావడంతో శృతి హాసన్ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు, ఫుల్ మాస్ మూవీగా తీర్చిదిద్దడంలో భాగంగా మరో మాస్ మసాలా స్పెషల్ సాంగును ప్లాన్ చేస్తున్నారు.

    ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే గీతాన్ని రీమిక్స్‌ చేయనున్నారు. ''మాస్‌ అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథ ఇది. చరణ్‌ పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. 'ఠాగూర్‌' తరహాలో కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నాం. తమన్‌ బాణీలు హుషారుగా సాగిపోతాయ''ని ఇటీవల ఓ సందర్భంలో వినాయక్‌ చెప్పారు. సంక్రాంతికి ఈ సినిమా తెర మీదకు వస్తుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే : ఆకుల శివ, సంగీతం : తమన్, ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు, నిర్మాత : డివివి దానయ్య, దర్శకత్వం : వివి వినాయక్.

    English summary
    The Swiss Alps, the Scottish Highlands, British castles and Spanish beaches these breathtaking European destinations have for long fascinated Indian filmmakers. Enter Slovenia, a tiny land nestled in central Europe that has just received the attention of Bollywood's overseas palette. The first one to introduce this Adriatic jewel to Indian cinema is Telugu film "Nayak".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X