twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ‘నాయక్’ ట్రైలర్ దీపావళికి కాదా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నాయక్'. దీపావళికి ఈచిత్రం ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీపావళికి ట్రైలర్ రిలీజ్ కావడం లేదని తాజాగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

    'నాయక్' ఆడియో నవంబర్ 25న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆడియో వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవుతోందని, పవన్ కళ్యాణ్ తప్పకుండా హాజరయ్యేలా ఈ ఆడియో వేడుక ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

    రామ్ చరణ్ ఈ చిత్రంలో ఇద్దరు హీరోన్లతో యమరంజుగా రొమాన్స్ చేసి ప్రేక్షకులను అలరించనున్నాడు. చరణ్ కి జోడీగా హీరోయిన్ కాజల్, అమలపాల్‌లపై చిరంజీవి సూపర్ హిట్ సాంగులను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు...'నాయక్' చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ అదరిపోతోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం గుంటూరు మినహా అన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి రికార్డు స్థాయి రేటు పలికిందని తెలుస్తోంది.

    ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డివివి దానయ్య నిర్మాత. బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

    English summary
    Megapower star Ram Charan's Nayak teaser is not releasing for Diwali. Sources close to the production house say that the first trailer will not be unveiled this Diwali as speculated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X