‘నాయక్’ యూఎస్ రైట్స్ ఎవరకీ అమ్మని నిర్మాతలు
హైదరాబాద్: జులాయి, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూనివర్సల్ మీడియా తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌తో 'నాయక్' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'నాయక్' చిత్రాన్ని యూఎస్ లో స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తాము ఆశించిన అమౌంట్ చెల్లించడానికి ముందుకు రాక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం విషయంలోనూ నిర్మాతలకు ఇలాంటి సమస్యే ఏర్పడింది. అదే సమస్య ఇప్పుడు 'నాయక్' సినిమా విషయంలోనూ ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూఎస్‌లో భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని అక్కడి మార్కెట్ ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆ సంస్థ. 'నాయక్' చిత్రంతో అందుకు శ్రీకారం చుట్టింది.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాయక్' చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్, అమల పాల్ హీరోయిన్లగా చేస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 9న సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 25న ఆడియో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఇంకా బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











