చరణ్ బెంజ్ కారుకు తెలంగాణ రిజిస్ట్రేషన్, నెంబర్ ఇదే...

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ రామ్ చరణ్ కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడెజ్ బెంజ్ కారుకు హైదరాబాద్ లోని ఖైరతా‌‍బాద్ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తంతు పూర్తయింది. రిజిస్ట్రేషన్ కోసం రామ్ చరణ్ స్వయంగా కార్యాలయానికి వచ్చి సంతకం చేసారు. రూ. 10వేల రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి 'టీఎస్ 09, ఈబి 2727' నెంబర్‌పై తన కారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

తన తండ్రి చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22ను సెంటిమెంటుగా భావించిన రామ్ చరణ్ అదే రోజు కారును రిజిస్టర్ చేయించుకోవడం గమనార్హం. మరో విశేషం ఏమంటే చిరంజీవికి పుట్టినరోజు కానుకగా టయోటా ల్యాండ్ క్రూయిజర్ అనే కారును గిఫ్టుగా కొనిచ్చాడు చరణ్.

Ram Charan new car no: TS 09 EB 2727

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే...
ప్రస్తుతం రామ్ చరణ్ కృష్ణ వంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్లో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రామ్ నటిస్తున్న తొలి ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇది.

ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఈచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం పూర్తయిన తర్వాత తన తండ్రి చిరంజీవికి సంబంధించిన 150వ సినిమా నిర్మాణంపై దృష్టి సారించనున్నారు రామ్ చరణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X