రామ్ చరణ్ లగ్జరీ లైఫ్, 8 కోట్లతో కారావాన్ కొనుగోలు!

హాలీవుడ్, బాలీవుడ్లలో ఎప్పటి నుండో ఈ ట్రెండ్ ఉంది. ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారి వల్ల ఈ ట్రెండు టాలీవుడ్ పరిశ్రమలోనూ మొదలైంది. మహేష్ బాబు ఇప్పటికే రూ. 8.5 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా కారావాన్ డిజైన్ చేయించుకోగా, జూ ఎన్టీఆర్ రూ. 6.5 కోట్ల ఖర్చుతో కారావాన్ డిజైన్ చేయించుకున్నారు.
తాజాగా ఈ లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయారు. దాదాపు రూ. 8 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా కారావాన్ డిజైన్ చేయించుకుంటున్నాడు. దిలీప్ చాబ్రియా డిజైన్స్ ప్రై.లి సంస్థ ఈ కారావాన్ డిజైన్ చేస్తోంది. గతంలో ఈ సంస్థ హాలీవుడ్ జేమ్స్ బాండ్ మూవీ 'డై అనదర్ డే' చిత్రం కోసం ప్రత్యేకంగా కారు డిజైన్ చేసింది.
రామ్ చరణ్ కోసం డిజైన్ చేసే కారావాన్లో వరల్డ్ క్లాస్ ఇంటీరియర్స్, ఎల్ఇడి స్క్రీన్స్, లగ్జరీ ఫర్నీచర్‌తో అత్యాధునిక సౌకర్యాలన్నీ ఉండనున్నాయి. దీని తయారీకి దాదాపు 6 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. రామ్ చరణ్ త్వరలో కృష్ణ వంశీ చిత్రం షూటింగులో పాల్గొనబోతున్నాడు. అప్పటి వరకు ఈ కారు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











