రామ్ చరణ్ కొత్త చిత్రం మే 28 ఓపినింగ్
హైదరాబాద్ : రామ్ చరణ్ కొత్త చిత్రం మే 28న ప్రారంభం కానుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ముహూర్తం హైదరాబాద్ లో సిని పెద్దల సమక్షంలో జరగనుంది. మిర్చి దర్సకుడు కొరటాల శివ డైరక్షన్ చేస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాతగా శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. మరో వారం లో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ....రామ్ చరణ్‌ను ఆయన గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. రామ్ చరణ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications












