రామ్ చరణ్ చిత్రం వాయిదా
రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్లో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేయనున్న చిత్రం ప్రారంభం వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగబాబు చెప్పారు. మొదటి అనుకున్నట్లుగా ఈ నెల పది న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం జరగాలి. అందుకు సంభందించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే రాష్ట్రంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ తేదిని ఇరవై ఒకటికి మార్చారు. ఆ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని హై టెక్నికల్ వ్యాల్యూస్ తో చిత్రాన్ని జనరంజకంగా మారుస్తామని చెప్పారు.
అలాగే బోణి చిత్రం హీరోయిన్ కృతి కర్భంద సకెండ్ హీరోయిన్ గా సెలక్టయినట్లు సమచారం. మొదటి హీరోయిన్ గా జెనిలియా చేస్తోంది. ఈ నెల ఇరవై తారీఖున ప్రారంభమయ్యే ఈ చిత్రం మొదటి షెడ్యూలు ఆస్ట్రేలియాలో జరగనుంది. అంజనా ప్రొడక్షన్స్ పై భారీగా నిర్మించనున్న ఈ చిత్రానికి హరీష్ జేరాజ్ సంగీతం అందిస్తున్నాడు. తోట ప్రసాద్ మాటల రాస్తున్నాడు. ఆనంద సాయి ఆర్ట్స్ వర్క్ చేస్తున్నారు. ఆరెంజ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో రామ్ చరణ్ ప్లే బోయ్ పాత్రను చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











