రామ్ చరణ్,కొరటాల శివ చిత్రం టైటిల్
'టాప్ లేచిపోద్ది' అనేది రీసెంట్ గా విడుదలైన 'ఇద్దరమ్మాయిలతో' ఆడియో లోది. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ పాట ఇప్పటికే ఆడియన్స్ లోకి దూసుకుపోయి... 'టాప్ లేచిపోద్ది' అని అంతటా వినపిస్తోంది. దాంతో ఇదే టైటిల్ ని ఫైనల్ చేసారని తెలుస్తోంది.
ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. మరో వారం లో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ....రామ్ చరణ్‌ను ఆయన గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది.
రామ్ చరణ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications












