రామ్ చరణ్-షాజాహాన్ పదంసీలు ఆరంజ్ లో ‘రూబా రూబా...’!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, జెనిలియా, షాజాహాన్ పదంసీలు హీరోయిన్లుగా నాగబాబు నిర్మాతగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఆరెంజ్'. ప్రస్తుతం ఈచిత్రం మలేషియాలో షూటింగ్ జరుపుకుంటోంది. విక్టరీ వెంకటేష్ నటించిన వాసు, ఘర్షణ వంటి చిత్రాలకు మెలోడి సాంగ్స్ కంపోస్ చేసినటువంటి హరీష్ జైరాజ్ సంగీతాన్ని అందింస్తోన ఈ చిత్రం ప్రస్తుతం 'రూబా రూబా' అనే పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ పాటని రామ్ చరణ్ తేజ్, షాజాహాన్ పదంసీల పై చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రం ఆడియోని మెగాస్టార్ చిరంజీవి జన్మదినమైన ఆగస్ట్ 22న విడుదల చేసి, చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ అక్కగా 'కావ్యాస్ డైరీ, షో" వంటి చిత్రాల్లో నటించిన సూపర్‌స్టార్ కృష్ణ కూతురు మంజుల నటిస్తోంది. ఇక మంజుల భర్తగా 'ఏ మాయ చెసావే, 'నాని" చిత్రాల్లో నటించిన సంజయ్ స్వరూప్ నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











