రామ్ చరణ్ వెపన్ బయటపెట్టిన వినాయక్
హైదరాబాద్: వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'నాయక్'. కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రం జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సినిమాల్లో హీరో కోసం ప్రత్యేకంగా వెపన్(ఆయుధం) తయారు చేయించడం మనం చూస్తూనే ఉన్నాం.
క్లైమాక్స్ ఫైట్ లోనే, లేక ఇంకేదైనా ప్రత్యేక సందర్భంలో ఆ ఆయుధంతో ఫైట్ చేస్తాడు హీరో. తాజాగా నాయక్ చిత్రంలో కూడా ఇలాంటి వెపన్ తయారు చేయించారు దర్శకుడు వివి వినాయక్. తాజాగా విడుదల చేసిన నాయక్ వర్కింగ్ స్టిల్స్ ద్వారా ఈ ఆయుధం విషయం బయట పడింది.
గతంలో రామ్ చరణ్ మగధీర సినిమాతో పాటు ఇతర చిత్రాల్లో వివిధ రకాల వెపన్స్ వాడిన సంగతి తెలిసిందే. తాజాగా 'నాయక్' చిత్రం విషయంలో కూడా అదే ఆనవాయితీ రిపీట్ అవుతోంది. వివి వినాయ్ గత చిత్రాలైన యోగి, లక్ష్మి, బద్రినాథ్ చిత్రాల్లో ఇదే విధంగా హీరో కోసం ప్రత్యేకమైన వెపన్స్ చేయించాడు. ప్రత్యేక వెపన్ ఉందంటే మాస్ ఆడియన్స్ మెచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లే లెక్క.
నాయక్ సినిమా విశేషాల్లోకి వెళితే...
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటర్ అయింది. ఈ ఫైనల్ షెడ్యూల్ లో క్లైమాక్స్ సీన్స్, ఓ సాంగును చిత్రీకరించనున్నారు. డిసెంబర్ 18 వరకు షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్, నిర్మాత: డివివి దానయ్య, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











