రామ్ చరణ్.... నెక్ట్స్ 5 ప్రాజెక్టులు ఇవే!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన టాలెంట్‌తో రాణిస్తూ ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకున్న రామ్ చరణ్ అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
సంక్రాంతికి 'నాయక్' చిత్రం ద్వారా హిట్ కొట్టిన చెర్రీ.... ఈ సంవత్సరం వరుస ప్రాజెక్టులు చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న 'జంజీర్' చిత్రం వేసవిలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేయనున్నారు.
అదే విధంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న మరో చిత్రం 'ఎవడు' చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. వీటి తర్వాత చెర్రీ నటించబోయే మరో మూడు ప్రాజెక్టులు ఓకే అయ్యాయి. అందులో ఒకటి మిర్చి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో, మరొకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో, మరొకటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉండనున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రాన్ని గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించనున్నారు. అదే విధంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంపై కూడా మంచి అంచనాలున్నాయి. గతంలో త్రివిక్రమ్ పవన్‌తో జల్సా, బన్నీతో జులాయి చిత్రాలు తెరకెక్కించి హిట్ కొట్టడమే ఇందుకుకారణం.


Click it and Unblock the Notifications











