అశ్వనీదత్ నిర్మాతగా రామ్ చరణ్ చిత్రం ఖరారు

By Srikanya

హైదరాబాద్ : చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి ఎన్నో హిట్ చిత్రాలు అందించిన వైజయింతీ మూవీస్ తాజాగా రామ్ చరణ్ తో ఓ చిత్రం చేయటానికి ఎగ్రిమెంట్ చేసుకుంది. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించనున్నారు. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. అత్యున్నత సాంకేతిక విలువలతో... అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రామ్‌చరణ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయే విధంగా ఈ సినిమాను రూపొందించాలని దర్శకుడు శ్రీను వైట్ల కృషి చేస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం వైజయంతీ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'సారొస్తారు'. రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదిలావుంటే... 'సారొస్తారు' తర్వాత వైజయంతీ సంస్థ నుంచి వచ్చే ఈ సినిమా ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. చిత్రం యాక్షన్ కామెడీగా ఉంటుందని చెప్తున్నారు. గతంలో చిరంజీవితో అందరివాడు తీసిన శ్రీను వైట్ల కు భాక్సాఫీస్ వద్ద సరైన ఫలితం లభించలేదు. దాంతో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ ఇచ్చి మెగాభిమానులను ఆనందపరచాలని అభిలషిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'బాద్‌షా' చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు శ్రీను వైట్ల. బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌. అలాగే కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఫైట్ సీన్స్ తీస్తున్నారు.

అలాగే రామ్‌చరణ్ కూడా వీవీ వినాయక్ దర్శకత్వంలో 'నాయక్' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం 2013 సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే పైడిపల్లి వంశీ దర్శకత్వంలో 'ఎవడు' చిత్రం చేస్తున్నారు. అల్లు అర్జున్ గెస్ట్ రోల్ లో కనిపించే ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా జరిగింది. ఇక బాలీవుడ్ 'జంజీర్'రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తవగానే ఈ సినిమా సెట్స్‌కి వెళుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X