రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ టైటిల్ ‘రక్షక్’
హైదరాబాద్: జయం రవి, నయనతార, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో ఎం.రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాని ఒరువన్' చిత్రం తమిళంలో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి హైలెట్ అయ్యాడు. ఇదే చిత్రాన్ని తెలుగులో రామ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.
సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. సినిమాను సంక్రాంతి సందర్భంగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ మూవీలో పోలీస్ పాత్రలో నటించబోతున్నాడు. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అరవింద స్వామి క్రిమినల్ సైంటిస్టుగా నటిస్తున్నాడు.
తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘రక్షక్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. శృతి హాసన్, లేదా ఇలియానాను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. తెలుగులో నటించడానికి అరవింద స్వామి రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నాడట.

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా ఫలితంతో రూటు మార్చాడు. నెక్ట్స్ తాను చేయబోయే సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకూడదని, కేవలం సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో షేరింగ్ మాత్రమే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. ఇలా చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని, సినిమాను నష్టాల భారి నుండి తప్పించవచ్చని అంటున్నాడు.
అల్లు అరవింద్ సలహా మేరకే రామ్ చరణ్ రెమ్యూనరేషన్ విషయంలో రూటు మార్చాడని అంటున్నారు. థాని ఒరువన్ మూవీలో మాస్ మసాలా ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. కేవలం కథ ఆధారంగా మాత్రమే నడిచే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను రూ. 25 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











