చరణ్ మూడో చిత్రం 'ఆరెంజ్'?
'చిరత' చిత్రం ద్వారా పరిచయమైన చిరు తనయుడు రామ్ చరణ్, తన రెండవ సినిమాతోనే టాలీవుడ్ లోని అన్ని రికార్డులనీ బద్దలుకొట్టి 'మగధీరు'డు అనిపించుకున్నాడు. 'మగధీర'లో రెండు వైవిధ్యమైన పాత్రలతో అందరి మన్ననలు అందుకున్న చరణ్ ప్రస్తుతం తన మూడవ చిత్రానికి సన్నద్ధం అవుతున్నాడు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 'ఆరెంజ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన వరుస విజయాలతో దూసుకుపోతున్న జెనీలియా కథానాయికగా నటిస్తోంది. ఈమెతో పాటు ఇంకో ముగ్గురు కథానాయికలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడా కథానాయికల కోసం అన్వేషన జరుగుతోంది. 'బోణి' చిత్రం ద్వారా పరిచయమైన కృతి పేరు సెకెండ్ హీరోయిన్ గా ప్రముఖంగా వినిపిస్తోంది. మొదటి రెండు చిత్రాలలో యాక్షన్ హీరోగా మెప్పించిన చరణ్ ఈ చిత్రంలో ప్లే-బాయ్ గా కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











