»   »  రామ్ చరణ్ నెక్ట్స్ రెండూ మల్టి స్టారర్సే

రామ్ చరణ్ నెక్ట్స్ రెండూ మల్టి స్టారర్సే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడు మల్టి స్టారర్స్ సీజన్ నడుస్తోంది. తాజాగా రామ్ చరణ్ కమిటైన రెండు చిత్రాలూ మల్టి స్టారర్సే కావటం విశేషం. మొదటి చిత్రంలో వెంకటేష్, రెండో చిత్రంలో సల్మాన్ ఖాన్ ...రామ్ చరణ్ తో పాటు తెరపై కనిపిస్తారు. దాంతో ఖచ్చితంగా సినిమాలకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ ప్రస్తుతం ...అల్లు అర్జున్ గెస్ట్ గా ... ఎవడు చిత్రం చేసి మల్టి స్టారర్ అనిపించుకున్నారు.

రామ్ చరణ్ త్వరలో కృష్ణ వంశీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నరంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమేనని, వెంకటేష్ గారితో కలిసి పని చేయబోతున్నట్లు రామ్ చరణ్ సైతం మీడియాకు స్వయంగా వెల్లడిచారు. ఈ చిత్రం వెంటనే ప్రారంభించాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ చిత్రం అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు టీమ్...రామ్ చరణ్ సరసన చేసే హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.

మల్టీస్టారర్‌ చిత్రం విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ... తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతం ఆ కథమీదే కూర్చున్నాం. కృష్ణవంశీ ఒక మంచి కుటుంబ కథని తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు కుటుంబకథా చిత్రాల్ని చూడటానికి ఇష్టపడుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. అలాగే వెంకటేష్‌గారితో కలిసి నటించాలని ఎప్పట్నుంచో అనుకొం టున్నా. అది త్వరలోనే నెరవేరుతుంది. ఇది మల్టీస్టారర్‌ చిత్రమే. పూర్తి వివరాలు మాత్రం నెల తర్వాత తెలుస్తాయి అన్నారు.

హిందీలో సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను. మేమిద్దరం కలిసి ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నాం. సల్మాన్‌ఖాన్‌ నిర్వహిస్తున్న 'బీయింగ్‌ హ్యూమన్‌' అనే స్వచ్ఛంద సంస్థ కోసం ఇద్దరం కలిసి ఓ సినిమా చేయబోతున్నాం. మంచి కథ దొరకడమే ఆలస్యంఅని చెప్పారు.


ఇప్పుడు మల్టిస్టారర్స్ టైమ్ నడుస్తోంది. ఆ ట్రెండ్ ని అనుసరిస్తూ రామ్ చరణ్ ..ఎవడు చిత్రం చేస్తున్నారు. అయితే అందులో అల్లు అర్జున్ చిన్న పాత్రలో మాత్రమే కనిపించనున్నారు. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ మరో మల్టిస్టారర్ కి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తో పాటు ఈ సారి వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణ నటించనున్నారని సమాచారం. కథ ఇంతకు ముందు...నాగచైతన్య,నాగార్జున, అక్కినేనిలతో కృష్ణ వంశీ చేద్దామనుకున్న కథే అని చెప్పుకుంటున్నారు.

అలాగే సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ సంస్థలో చరణ్ సినిమా చేయబోతున్నాడని, సల్మాన్ స్వయంగా పిలిచి ఈ ఆఫర్ ఇచ్చాడని టాక్. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి. రామ్ చరణ్‌తో పాటు ఆయన అభిమానులు కూడా 'జంజీర్' చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌కు సల్మాన్ ఖాన్ సంస్థలో చేసే అవకాశం రావడం ఊరట కలిగించే విషయమనే చెప్పాలి.

దీంతో పాటు మరో రెండు బాలీవుడ్ చిత్రాల్లో కూడా ఆయన కమిటైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సపోర్టుతో వచ్చిన వారంతా పెద్ద స్టార్లుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో సల్లూభాయ్‌తో మంచి ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్న రామ్ చరణ్‌కు అతని చేయూత బాగా ప్లస్సవుతుందని, అన్నీ కలిసొస్తే రామ్ చరణ్ భవిష్యత్‌లో బాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
Ram Charan Zanjeer got released and ended with mixed reviews.Apart from the movie result now Charan is planning for his upcoming projects.Now the hero is getting ready to shoot for two projects simultaneously from October. Charan confirmed that he was going to act under the direction of creative director Krishna vamsi.The movie is family based multi-starrer movie in which Charan may acts as younger brother of victory venkatesh. “Krishna Vamsi has come up with a nice family subject. We are working on the script and an official announcement will be out in October. It will be a multi-starrer with Venkatesh garu.” he confirms. Charan also exposed about his second Bollywood venture which may be mostly with a salman khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu