ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటా పోటీగా ఒకే రోజు...

By Srikanya

Jr Ntr - Ram Charan
హైదరాబాద్: రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ ఒకే రోజు తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు. ఇద్దరూ భాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారు. ఇద్దరి చిత్రాలు సంక్రాంతి రోజునే విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతన్నాయి. 2013 సంక్రాంతికి ఇద్దరి ప్రెస్టేజియస్ ప్రాజెక్టులూ ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఎన్టీఆర్ బాద్షా, రామ్ చరణ్ నాయక్ చిత్రాలు రెండూ అదే రోజున ప్రేక్షకులను అలరించనున్నాయి. అయితే ధియోటర్స్ సమస్య ఏర్పడే అవకాసం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఎన్టీఆర్ గతంలో అదుర్స్ తో సంక్రాంతికి భాక్సాఫీస్ వద్ద విజయం సాధించి ఉన్నారు. రామ్ చరణ్ మాత్రం ఇదే తొలిసారి. రెండు ప్రాజెక్టులపైనా ప్రేక్షకులలో చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా దర్శకులు శ్రీనువైట్ల, వినాయిక్ లు కూడా తమ ప్రాజెక్టులపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాగే రెండు సినిమాలు యాక్షన్ కామెడీలే కావటం విశేషం. అంతేగాక రెండు సినిమాల్లోనూ బ్రాహ్మానందం కీ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ సైతం 'బాద్‌షా' చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ, కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన బండ్ల గణేష్, దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.

రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'నాయక్' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ది లీడర్ అనేది ట్యాగ్ లైన్ తో రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఐస్ ల్యాండ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా, ద్వి పాత్రలతో ఉండనుంది. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికి ఉపయోగపడేలా ఉంటుంది. దర్శకుడు రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X