జూ ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్ లకు దయ లేదా?
తెలుగు చిత్రసీమ యువ హీరోలకు దయలేదనే మాట వినిపిస్తోంది. తమిళ హీరో విజయ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజా, ప్రభాస్ వంటి తెలుగు యువ హీరోలు చాలా నేర్చుకోవాల్సి ఉందనే మాట వినిపిస్తోంది. తెలుగు ప్రజలకు సాయం అందించడానికి తెలుగు హీరోలు ముందుకు రాని వేళ తమిళ హీరో ముందుకు వచ్చి తన ఉదారతను చాటుకున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన యశ్వంత్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. సాయం కోసం తెలుగు యువ హీరోలను కలుసుకోవడానికి అతను ఎక్కడని కడప దిగని కడప లేదు. కొన్ని నెలల పాటు అతను పడిన శ్రమ వృధానే అయింది. చివరకు పలు తెలుగు సినిమాల్లో నటించిన రాఘవేంద్ర లారెన్స్ ను సంప్రదించాడు. తమిళ చిత్ర సీమకు చెందినవారితో అతనో చారిటీ హోమ్ నడుపుతున్నాడు. వెంటనే లారెన్స్ తమిళ హీరో విజయ్ ను సంప్రదించాడు. యశ్వంత్ అనే బాలుడి చికిత్స కోసం విజయ్ ముందుకు వచ్చి పెద్ద మొత్తంలో సొమ్ముకు చెక్ ఇచ్చేశాడు. అంతేకాకుండా తన పర్సనల్ సెల్ నెంబర్ ఇచ్చి మరే సాయం కావాలన్నా సంప్రదించాలని విజయ్ యశ్వంత్ కు చెప్పాడు. దీంతో ప్రస్తుతం యశ్వంత్ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Click it and Unblock the Notifications











