»   » ఫోటోస్ : బ్యాగులు సర్దుకుని ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్, రాంచరణ్..రాజమౌళి పథకమే!

ఫోటోస్ : బ్యాగులు సర్దుకుని ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్, రాంచరణ్..రాజమౌళి పథకమే!

Subscribe to Filmibeat Telugu

రాజమౌళి భారీ మల్టి స్టారర్ చిత్రానికి అంతా సిద్ధం అవుతోంది. రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరెకెక్కించబోయే మల్టి స్టారర్ చిత్ర పనులు మొదలైనట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం కాక మునుపే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకుని వెళ్ళడానికి రాజమౌళి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. త్వరలోనే ఎన్టీఆర్, రాంచరణ్ కు రాజమౌళి వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అని అనిపిస్తోంది. తాజగా రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ బ్యాగులు సర్దుకుని ఎయిర్ పోర్టులో కనిపించారు. యుఎస్ లో రాజమౌళి వీరిద్దరికి టెస్ట్ షూట్ నిర్వహించనున్నట్లు లెట్స్ న్యూస్.

అప్పడు ప్రభాస్,రానా ...ఇప్పడు చరణ్, ఎన్టీఆర్
రాజమౌళి భారీ మల్టిస్టారర్

రాజమౌళి భారీ మల్టిస్టారర్

రాజమౌళి బాహుబలి తరువాత ఇటివంటి చిత్రాన్ని చెప్పడతాడు అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉండగా రాంచరణ్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

 ఎన్టీఆర్, రాంచరణ్ తొలిసారి

ఎన్టీఆర్, రాంచరణ్ తొలిసారి

ఎన్టీఆర్, రాంచరణ్ ఇదివరకే రాజమౌళి దర్శకత్వంలో నటించారు. కానీ వీరిద్దరూ కలసి నటించబోతుండడం ఇదే తొలిసారి. దీనితో వీరిద్దరూ కలసి ఎలా నటిస్తారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొనివుంది.

బాక్సింగ్ నేపథ్యంలో

బాక్సింగ్ నేపథ్యంలో

బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా రాజమౌళి స్పోర్ట్స్ నేపథ్యంలో సై చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

బ్యాగులు సద్దుకుని ఇద్దరూ

బ్యాగులు సద్దుకుని ఇద్దరూ

రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తాజాగా బ్యాగులు సద్దుకుని విమానాశ్రయంలో కనిపించారు, ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజమౌళి సినిమా కోసమే వీరు విదేశాలకు బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి పథకమే

రాజమౌళి పథకమే

సినిమా ప్రారంభించడానికంటే ముందుగా రాజమౌళి అంతా పక్కాగా సిద్ధం చేసుకుంటారు. అందులో భాగంగానే చరణ్, ఎన్టీఆర్ కు విదేశాల్లో వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో టెస్ట్ షూట్ కూడా నిర్వహిస్తారట. దీనికోసమే చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ యుఎస్ వెళుతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే షూటింగ్

త్వరలోనే షూటింగ్

ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలని త్వరగా పూర్తి చేసి షూటింగ్ మొదలుపెట్టాలని రాజమౌళి భవిస్తున్నాడు. అందుకే ఎన్టీఆర్, చరణ్ వారి వారి చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ రంగంలోకి దించేశాడు.

English summary
Ram Charan and NTR snapped at airport. Both stars are going to US for Rajamouli film test shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu