twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకే ఇంట్లో చరణ్, ఎన్టీఆర్.. కిలికి తరహాలోనే, అడవిలో యుద్ధం.. ఆర్ఆర్ఆర్ షూటింగ్!

    |

    Recommended Video

    RRR Movie Shooting Was Planned In A Special Set | Filmibeat Telugu

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం సిద్ధం అవుతున్నారు. ఇటీవల ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆరంభం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చరణ్, ఎన్టీఆర్ కలసి నటించబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గురించి బయటకు వస్తున్న ఒక్కో విశేషం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

    పనిరాక్షసుడు

    పనిరాక్షసుడు

    రాజమౌళికి ఇండస్ట్రీలో పని రాక్షసుడు అని పేరు ఉంది. సినిమా పర్ఫెక్ట్ రావడం కోసం రాజమౌళి ఎంత కష్టాన్ని అయినా భరిస్తారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం రాజమౌళి అవలంభిస్తున్న ప్లాన్ కళ్ళు చెదిరే విధంగా ఉంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యే వరకు పూర్తి దృష్టి దీనిపైనే పెట్టనున్నారు.

    సెట్‌లోనే ఇల్లు

    సెట్‌లోనే ఇల్లు

    హైదరాబాద్ నగర శివారులో నిర్మించిన ఓ సెట్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం సగానికి పైగా షూటింగ్ జరుగుతుందట. దీనితో ఎక్కువరోజులు చిత్ర యూనిట్ అక్కడే గడపాల్సి ఉంటుంది. రాజమౌళి తన చిత్ర యూనిట్ కోసం సెట్ లోనే ఓ ఇల్లు నిర్మించినట్లు తెలుస్తోంది. రాజమౌళితో పాటు, ఎన్టీఆర్, చరణ్ అదే ఇంట్లో షూటింగ్ పూర్తయ్యే వరకు ఉండనున్నారట.

     ప్రత్యేక గదులు

    ప్రత్యేక గదులు

    రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ కు ఈ ఇంట్లో మూడు ప్రత్యేక గదులు కేటాయించారట. ఆ ఇంట్లోనే ఎడిటింగ్ కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. చిత్రానికి సంబందించిన కీలక వస్తువులు ఆ ఇంట్లోనే భద్రపరుచుకోనున్నారు. కాస్ట్యూమ్స్, సన్నివేశానికి సంబందించిన చర్చలు ఈ ఇంట్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది.

     అటవీ నేపథ్యంలో

    అటవీ నేపథ్యంలో

    ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించిన మరో వార్త ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ అటవీ నేపథ్యంలో భారీ సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందట. ఈ సన్నివేశాలకు బాహుబలి చిత్రంలోని కిలికి భాష తరహాలో కొత్త భాషని సిద్ధం చేస్తున్నట్లు కూడా ఓ ప్రచారం జరుగుతోంది.

    అనేక ఊహాగానాలు

    అనేక ఊహాగానాలు

    ఈ చిత్రం 1920 కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతుందని, బాక్సింగ్ కి సంబంధించిన కథ అని జోరుగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ అంటే రామ రావణ రాజ్యం అని ఈ చిత్ర టైటిల్ అదే అని ప్రచారం జరుగుతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Interesting details about RRR movie shooting. Ram Charan and NTR will stay in single house for long time
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X