Don't Miss!
- News
నేను బతికితే ఏంటీ? చస్తే ఏంటీ?: కేసీఆర్పై రాజా సింగ్ సంచలన ఆరోపణ
- Sports
INDvsNZ : ‘షోలే2’ వచ్చేస్తుంది.. బాలీవుడ్ సీన్ రీక్రియేట్ చేసిన టీమిండియా కెప్టెన్!
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
Chanakya Niti: ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
యూట్యూబర్‌కు రాంచరణ్ ఫోన్.. మాల తీయగానే చేసిన మొదటి పని ఏమిటంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం అయ్యప్ప మాల ధారణ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆయన అయ్యప్ప మాల ధారణ చేశారు. అయితే తాజాగా ఆయన మాల విరమణ చేసినట్లు తెలుస్తోంది. మాల విరమణ చేసీ చేయగానే ఆయన చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే రామ్ చరణ్ ఏం చేశారు? ఎందుకు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. అనే వివరాల్లోకి వెళితే

తన పని తాను చేసుకుంటూ
రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR ఎంత అద్భుతమైన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఆయన ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ పంచుకున్నారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. కానీ తన తండ్రితో కలిసి చేసిన ఆచార్య సినిమా మాత్రం రామ్ చరణ్ కు నిరాశ కలిగించింది అనే చెప్పాలి. అయితే సినిమా జయాపజయాలతో పని లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

యూట్యూబ్ ఛానల్ లో
ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతోంది. నిజానికి ప్రతి ఏటా అయ్యప్ప మాలధారణ చేసే రామ్ చరణ్ తేజ్ RRR సినిమా కారణంగా మాల ధారణ చేయలేకపోయారు. దీంతో RRR సినిమా విడుదలైన వెంటనే ఆయన మాలధారణ చేశారు. అయితే ఆయన మాల ధారణ చేసి 41 రోజులు పూర్తయిన కారణంగా మాల విరమణ చేసినట్లు తెలుస్తోంది. పూర్తిగా 40 రోజులు నియమనిష్టలతో దీక్ష తీసుకున్న రామ్ చరణ్ తన మేనేజర్ చేత ఫోన్ చేయించారు అంటూ ఒక తెలుగు యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో విడుదల చేశారు.

జగపతి బాబు బ్యాచ్లో
ఆ యూట్యూబర్ మరెవరో కాదు, విశాఖపట్నం కేంద్రంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న లోకల్ బాయ్ నాని అనే వ్యక్తి. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన నాని సోషల్ మీడియాలో చాలా క్రేజ్ సంపాదించాడు ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ వేదికగా అలాగే యూట్యూబ్ వేదికగా వీడియోలు చేస్తున్నాడు నాని. ఎప్పటికైనా తెలుగు సినిమాల్లో విలన్ అవ్వాలనేది తన కోరికగా చెప్పుకునే నాని ఇప్పటికే మహాసముద్రం సినిమాలో ఒక చిన్నపాటి పాత్రలో కూడా కనిపించాడు. మహా సముద్రం సినిమాలో జగపతి బాబు బ్యాచ్లో ఉండే ఒక వ్యక్తిగా కనిపించి అలరించాడు.

రాంచరణ్ సమక్షంలో
అయితే అసలు విషయం ఏమిటంటే రామ్ చరణ్ ఆఫీస్ నుంచి తనకు కాల్ వచ్చిందని రామ్ చరణ్ తన వీడియోలు చూస్తుంటారని ఫోన్ చేసిన వారు చెప్పారని అలాగే కొన్ని రకాల చేపలు,పీతలు తీసుకురమ్మని అవి రాంచరణ్ సమక్షంలో వండి పెట్టాలని తనకు చెప్పినట్లు వీడియోలో పేర్కొన్నాడు. ఇక ఆ కొనుగోలు సహా ప్రతి విషయాన్ని వీడియో చేసిన నాని దాన్ని కూడా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు.

కలవడం కుదరలేదు
అయితే తీరా అన్నీ తీసుకుని రామ్ చరణ్ షూటింగ్ లొకేషన్ కి వెళ్తే అవి తీసుకుని డబ్బులు ఇచ్చారు కానీ రామ్ చరణ్ ను కలవడం కుదరలేదు అని చెప్పుకొచ్చాడు. మాల తీసిన వెంటనే నాని చేసిన వంట తినాలని ఉందని మేనేజర్ తో చరణ్ చెప్పినట్టు తనకు చెప్పారని కానీ తీసుకు వెళ్ళే సమయానికి రామ్ చరణ్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఆయనను కలవడం కుదరలేదు అని చెప్పుకొచ్చాడు.