హాట్ న్యూస్ : 'రోమియో' దర్శకుడుతో రామ్ చరణ్ చిత్రం

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్ మరో చిత్రం కమిటయ్యారు. సాయిరామ్ శంకర్ తో 'రోమియో' చిత్రం చేస్తున్న గోపీ గణేష్ ని తన తదుపరి చిత్రానికి దర్శకుడుగా ఎంచుకున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ ని కలిసి గోపీ గణేష్ ..స్టోరీ నేరేషన్ ఇచ్చారని, నేరేషన్ ఇచ్చిన తీరు నచ్చిన రామ్ చరణ్ మారు మాట లేకుండా వెంటనే ఓకే చేసారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం అయ్యే అవకాసం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్..ఎవడు,జంజీర్ చిత్రాల బిజీలో ఉన్నారు.

ఇక 'రోమియో' విషయానికి వస్తే... సాయిరామ్ శంకర్, అడోనిక (పరిచయం) హీరో హీరోయిన్లుగానటిస్తున్న చిత్రం 'రోమియో'. మహర్షి సినిమా పతాకంపై వల్లూరిపల్లి రమేశ్ నిర్మిస్తున్నారు. 'పూరి రాసిన ప్రేమకథ' అనేది శీర్షిక. పూరి జగన్నాథ్ వద్ద సహాయ దర్శకునిగా పలు చిత్రాలకు పనిచేసిన గోపిగణేశ్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడం విశేషం.

సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ "చరిత్రలో నిలిచిపోయిన ప్రేమజంట రోమియో, జూలియట్. వీరు యూరప్‌లో కలిసే ప్రదేశం వెరోనా. దీని నేపథ్యంలో జరిగే ప్రేమకథాచిత్రమే 'రోమియో'. యువతరాన్ని ఆకట్టుకునే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి'' అని చెప్పారు. సుబ్బరాజు, అలీ, ప్రగతి తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, విశ్వ, రెహమాన్, సంగీతం: సునీల్ కాశ్యప్, ఛాయాగ్రహణం: పి.జి. విందా, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, కళ: చిన్నా, ఫైట్స్: వెంకట్, కొరియోగ్రఫీ: రఘు, కథ, మాటలు: పూరి జగన్నాథ్, స్కీన్‌ప్లే, దర్శకత్వం: గోపిగణేశ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X