దాసరి ‘ప్లాస్టిక్ ఫేస్’ కామెంట్స్‌పై రామ్ చరణ్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్' ఆర్కే కార్యక్రమంలో ఆయన నుండి ఏమైనా ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని సీక్రెట్స్ ఓపెన్ అవుతాయేమోనని అంతా ఆశించారు. అయితే అలాంటిదేమీ జరుగలేదు. అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం రామ్ చరణ్ నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చారు.
ఆ మధ్య దాసరి నారాయణరావు ఏవో వ్యాఖ్యలు చేయడం, రామ్ చరణ్ వెంటనే కౌంటర్ ఇవ్వడం......రామ్ చరణ్ స్థాయి మరిచి స్పందించాడని విమర్శలు రావడం తెలిసిందే. ఈ విషయాన్ని ఆర్కే ప్రస్తావిస్తూ అంతలా ఎందుకు రియాక్ట్ అయ్యారు అని అడగ్గా రామ్ చరణ్ సమాధానం ఇస్తూ....నేనెప్పుడూ అంతే. ఊరికే ఉండటం నాకు చేతకాదు. వాదిస్తాను. లేకుంటే నాకు పట్టనట్లు ఉంటాను. దాసరిగారి మీద నాకు గౌరవం ఉంది. నాన్నగారితో ఆయనకు మంచి బంధం ఉంది. ఇద్దరూ బాగానే మాట్లాడుకుంటారు. కానీ మైకు పట్టుకున్నపుడే ఏమవుతుందో తెలియదు. ఒప్పటిలా తాను ఇపుడు దేనికీ రియాక్ట్ అవ్వడం లేదు. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా సాగాలని కోరుకుంటున్నానన్నాను అన్నారు.

వెంటనే ఆర్కే మరో ప్రస్తావన తెచ్చారు. ఆ మధ్య దాసరి ప్లాస్టిక్ ఫేసులంటూ వ్యాఖ్యలు చేసారు. సినిమాలకు పనికి రాకున్నా ముఖాన్ని మళ్లీ మళ్లీ చెక్కి చేయిస్తున్నారన్నారు. దీనిపై మీ స్పందన ఏమిటని రామ్ చరణ్ ను అడగ్గా....ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసారో తెలియదు. నా పేరు, నాన్నపేరు వాడి ఉంటే నేను సమాధానం ఇచ్చే వాడిని అంటూ రామ్ చరణ్ సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











