‘మగధీర’తో రామ్ చరణ్ తేజ్ కి అంతర్జాతీయ ఖ్యాతి!
'పీపుల్" కవర్ పేజి పై చోటు చేసుకున్న తొలి తెలుగు నటుడు రామ్ చరణ్ తేజ కావడం విశేషం టైమ్స్ ఇన్ కార్పొరేషన్ కు చెందిన పాపులర్ అమెరికన్ మ్యాగజైన్ 'పీపుల్" సౌత్ స్పెషల్ కవర్ పేజీ పై హీరో రామ్ చరణ్ తేజ చోటు సంపాదించుకున్నారు. బంజారా హిల్స్ లోని ల్యాండ్ మార్క్ బుక్ స్టోర్ లో జరిగిన కార్య క్రమంలో రామ్ చరణ్ ఈ డిసెంబర్ సంచికను ఆవిష్కిరించారు.
'పీపుల్" తో తన ఇంటర్వ్యూ గురించి మీడియాతో ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉన్నప్పుడు తను 'పీపుల్" మ్యాగ్ జైన్ చదివేవాడనని, ఇప్పుడు ఇండియన్ వర్షన్ ను ప్రారంభించండం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో నిఖాసైన వార్తలు, ఇంటర్వ్యూలు మాత్రమే ప్రచురితమవుతాయని అన్నారు. సౌత్ స్పెషల్ మ్యాగజైన్ కవర్ కథనం లో తాను చోటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పాత్రికేయుల ఇటర్వ్యూలో పాలుపంచుకొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆరంజ్ సినిమా గురించి సప్పెన్స్ అన్నారు.


Click it and Unblock the Notifications











